కగార్ ఆఖరి యుద్ధమా?

భూమి పొరల్లో ఉండే ఖనిజాలు కావాలి కానీ, భూమి పైన ఉండే ఆదివాసీలు పనికి రారా?

Update: 2024-08-10 17:18 GMT
సభలో మాట్లాడుతున్న పీఓడబ్ల్యు నాయకురాలు సంధ్య


‘‘అమెరికాలో రెడ్ఇండియన్లను అంతమొందించడానికి ఆ దేశ అధ్యక్షుడు రూజ్ వెల్ట్ పెట్టిన పేరే ఆపరేషన్ గ్రీన్ హంట్. అమరికా రక్త చరిత్ర ను అనుసరిస్తూ ఆ గ్రీన్ హంట్ ను ఇక్కడ అమలు చేస్తావా? ‘ఆపరేషన్ కగార్‘ ఆఖరి యుద్ధమా? ఇక్కడి ప్రజలతో ఆఖరి యుద్ధం చేయడానికి బ్రిటిష్ వాడికే వీలు కాలేదు. ఆఖరి యుద్ధమనడానికి నీకు సిగ్గు లేదా?’’ అని పీవోడబ్ల్యు జాతీయ కార్యదర్శి సంధ్య అన్నారు. ‘ఆదివాసీ హక్కులు-కార్పొరేటీకరణ-సంఘీభావ ఉద్యమాల’ పై హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండవ రోజు శనివారం జరిగిన జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు.

‘‘దేశ సార్వభౌమాధికారం గురించి మాట్లాడే హక్కు ఈ పాలకులకు లేదు. పచ్చదనాన్ని ఎవరైనా వేటాడతారా? పైన పచ్చదనం ఉన్న ఛత్తీస్ ఘడ్ భూముల్లో ఉన్న ఖనిజ సంపద కోసమే కదా ఈ ట్రెజర్ హంట్? నక్సలైట్ల పేరుతో ఛత్తీస్ ఘడ్ లో జరిగే హింసను ఆపండి. ఆదివాసీలపై జరిగే హింసను బుద్ధి జీవులంతా ఖండిస్తున్నారు. స్టాన్ స్వామి హత్యకు సమాధానం చెప్పరేమి?’’

‘‘ఛత్తీస్ ఘడ్ లో మత్యువు, జైలు, అత్యాచారం, లొంగుబాటే జీవితంగా బతుకుతున్నారు. ఛత్తీస్ ఘడ్ తోపాటు గడ్చిరోలి, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో పారామిలటరీ దళాలు పురుషాంగాన్ని పట్టుకుని ప్రజలపై యుద్దం చేస్తున్నాయి. ఆదివాసీలపైన అత్యాచారాలు చేస్తున్నారు. నిన్నటి దాకా కాశ్మీర్ ఒక జైలుగా మార్చారు. ఇప్పడు అడవినంతటినీ జైలుగా మార్చారు. సరిహద్దుల్లో ఉండాల్సిన భద్రతా దళాలు అడవి మధ్యలో ఎందుకు ఉంటున్నారు?’’ అని సంధ్య ప్రశ్నించారు.

ఆదానీకి బస్తర్ కు సంబంధం ఏమిటి : సోని సోరి 

సభలో మాట్లాడు తున్న ఆదివాసీ నాయకురాలు సోని సోరి.


‘‘నన్ను జైలులో పెట్టారు. హింసించారు. నేను ఆదివాసీ నుంచి వచ్చిన టీచర్ ని. ఛత్తీస్ ఘర్ లో మహిళలకు భద్రత లేదు. జల్ , జంగిల్, జమీన్ కోసం ఆదివాసీలు పోరాడుతున్నారు. వాటి కోసం ప్రాణమైనా ఇస్తారు.’’ అన్నారు ఛత్తీస్ ఘర్ లోని ఆదివాసీ హక్కుల నేత సోని సోరి ఈ సదస్సులో మాట్లాడుతూ . ‘‘అసలు ఆదాని ఎవరు? మా బస్తర్ జిల్లాకు ఆదానికి ఏమిటి సంబంధం? ఆరు నెలల శిశువును కూడా చంపేశారు.’’

‘‘ఛత్తీస్ ఘర్ లో రోడ్లు ఎందుకు వేశారు. మేమేమైనా రోడ్లు అడిగామా? ఎవరిని అడిగి వేశారు? పెద్ద పెద్ద రోడ్లు వేశారు. వాటిలో ఆదివాసీలు వెళ్లరు. అడవిలోకి వెళుతుంటే, వ్యవసాయం చేసుకుంటుంటే మమ్మల్ని ఆపడానికి మీరెవరు? డీఆర్ జీ ఏర్పాటు చేసి మా వాళ్లనే మా వాళ్లపైకి ఉసిగొలిపారు. మా వాళ్లని చంపి తీసుకురమ్మని, బహుమతులు ఇస్తామని మా వాళ్లనే ఆదేశిస్తాడు ఎస్పీ. లొంగిమ్మని, నాలుగు లక్షలు, ఆరు లక్షలు ఇస్తామని ఆశచూపిస్తాడు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? లొంగిపోయిన వారికి ఉద్యోగాలివ్వండి. డబ్బులెందుకు ఇస్తారు? ఆదివాసీల ఉత్సవం జరుపుకుంటుంటే జలియన్ వాలా బాగ్ లాగా కాల్పులు జరపడంతో మా వాళ్లంతా అడవుల్లోకి పారిపోయారు. ఎన్ని గుళ్లు కాలుస్తారో అన్నీ కాల్చండి. మరణించడానికి మేం సిద్దంగ ఉన్నాం. ’’ అంటూ సోని సోరి హెచ్చరించారు.ఇఫ్టూ నాయకురాలు అనురాధ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఆదివాసీల సమస్య ఫెడరలిజంలో భాగం : డాక్టర్ ఆర్తి నాగేశన్

‘‘ఫెడరలిజాన్ని ఆధారం చేసుకునే సిలింగేర్ ఉద్యమం సాగుతోంది. ఆదివాసీలకు ప్రత్యేక హక్కులున్నాయన్న అతి ముఖ్యమైన విషయాన్ని పాలకులు మర్చిపోయారు’’ అని నల్సార్ లా యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ ఆర్తి నాగేశన్ అన్నారు. ‘‘ఆదివాసీలు అడవుల్లో పుట్టి, అడవుల్లో పెరుగుతారు. చిట్టచివరి రక్తపు బొట్టు వరకు పోరాడతారు. వారిని ఆ ప్రాంతంవారిగానే గుర్తించాలి’’ అని కౌటిల్యుడు రాసిన అర్థ శాస్త్రంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

‘‘భూమి పొరల్లో ఉండే ఖనిజాలు కావాలి కానీ, భూమి పైన ఉండే ఆదివాసీలు పనికి రారు. సమాఖ్య గురించి మాట్లాడేటప్పుడు ఆదివాసీల విషయం కూడా సమాఖ్యలో భాగమని మర్చిపోకూడదు. ’’ అన్నారు ఆర్తి నాగేశన్.

నక్సలైట్ల పేరుతో హింస : కోదండరాం


సభలో మాట్లాడు తున్న ప్రొఫెసర్ కోదండరాం

 ‘‘నక్సలైట్ల పేరుతో ఆదివాసీలపైన హింస జరుగుతోంది. అక్కడి వనరులపైన సంపూర్ణ అధికారం ఆదివాసీలదే.’’ అని తెలంగాణా జలసాధన సమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అన్నారు. ‘‘అడవి చుట్టూ బ్రిటిష్ వాడు గిరి గీసి, అంతా ప్రభుత్వానిదేనన్నాడు. వాడు గిరి గీస్తే ప్రభుత్వానిది అయిపోతుందా? దున్ను కుంటున్న భూమి వాడిదై పోయింది. అడవులు వాడివైపోయినాయి. భూమి పైన హక్కులు కల్పించే చట్టాలంటారు. కానీ ఆదివాసీలను విధ్వంస చేసే చట్టాలను కూడా చేశారు. ఆదివాసీలు సేద్యం చేసే పద్ధతి వేరు. దాన్ని పోడు వ్యవసాయం అంటారు. దాన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. దున్నుకునే భూమి వారిదే. వారి హక్కుల కోసం పోరాడదాం’’ అంటూ పిలుపిచ్చారు.

మీడియాను అనుమతించరా : రఘు

పాటలు పడుతున్న ఆదివాసీ కళాకారులు


‘‘బస్తర్ లో ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్లడానికి వీలులేదు.ఎక్కడినుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు. ఎక్కడికి వెళుతున్నావు అని పోలీసులు ప్రశ్నిస్తారు. సమాధానాలు సంతృప్తి కరంగా లేకపోతే పోలీస్టేషన్ కు తీసుకెళతారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ హత్యలు, ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.‘’ అని బస్తర్ నుంచి వచ్చిన ఆదివాసీ రఘు మాట్లాడుతూ అన్నారు.

‘‘మీడియాను కూడా అనుమతించరు. ఇక్కడ జరిగే హింస బయటకు తెలియడం లేదు. ఇప్పపూల కోసం వెళతాం. తునికాకు కోసం వెళతాం. చేపలు పట్టుకోడానికి వెళతాం. పెద్ద రోడ్లు మాకెందుకు? స్వేచ్ఛగా తిరిగే మమ్మల్ని ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డును ఎప్పుడూ జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతాం? ఆధార్ కార్డు లేకపోతే మమ్మల్ని నక్సలైట్ అంటారు. రోజుల తరబడి చిత్రహింసలు పెడతారు. కోర్టులు, జడ్జిలు. జడ్జిలంటే ఏమిటో మాకు తెలియదు.’’


సభ లో ఆహుతులు


 ‘‘జనవరి నుంచి 182 మందిని చంపేశారు. మా చేతులతోనే మా కళ్లను పొడిపిస్తున్నారు. సుదర్శన రెడ్డి సార్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పడు సల్వాజుడుం రద్దైపోయింది. డీఆర్జీ లో చేర్చుకునేదంతా మా వాళ్లనే. వాళ్ల చేతే మా వాళ్లను చంపించేస్తున్నారు. డీఆర్ జీ, బస్తర్ ఫైట్స్, కోబ్రాలు వంటి వారందరి చేత మా పైన దాడులు చేయిస్తున్నారు. డీఆర్ జీలో చేస్తున్న వారు మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు. మహిళల చనుబాలను కూడా పరీక్షిస్తున్నారు.’’ అని ర

ఘ అక్కడి పరిస్థతిని వివరించారు.



Tags:    

Similar News