‘వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాలి’

"ఖాజానా ఖాళీగా ఉండటం వల్లే కొన్ని నిర్ణయాలను వెంటనే అమలు చేయలేకపోతున్నాం.";

Update: 2025-05-05 09:31 GMT

వ్యవసాయ రంగంపై తమ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వ్యవసాయరంగంలో మరిన్ని మార్పులు రావాలని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా ధరూర‌లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలని చెప్పారు. పురుగు మందులు, యూరియా వాడకాన్ని బాగా తగ్గించాలని కోరారు. యూరియాను ఇప్పటి రైతులు అధికంగా వాడుతున్నారని, అలా వాడి మనల్ని పోషించే భూతల్లిని నాశనం చేయొద్దని పేర్కొన్నారు.

‘‘పామాయిల్ సాగుతో రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దీని సాగు పెరగాలి. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఈ పంట సాగుకు అనుమతి ఉంది. ఆయిల్ పామ్‌లో మూడేళ్ల పాటు అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. గతంలో ఈ పంట దిగుబడి ఆరేళ్లకు వచ్చేది. కానీ ఇప్పుడు మూడేళ్లకే పంట దిగుబడి వస్తుంది. అంటే గతంలో ఒక పంట తీసే సమయంలో ఇప్పుడు రెండు పంటలను తీయొచ్చు. తద్వారా రైతు ఆదాయం రెండింతలు పెరుగుతుంది. గత ప్రభుత్వం రైతులను, వారి పంటల బీమాను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. అన్నదాతను అన్ని విధాలా ఆదుకుంటుంది. పంట బీమాను పునరుద్దరింస్తాం. ఖాజానా ఖాళీగా ఉండటం వల్లే కొన్ని నిర్ణయాలను వెంటనే అమలు చేయలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కదాన్ని కచ్ఛితంగా అమలు చేస్తాం’’ అని చెప్పారు.

Tags:    

Similar News