‘దేశాభివృద్ధిలో ఏఐ కీలకం’.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన

ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎంతగానో దోహదపడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-27 12:24 GMT

ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎంతగానో దోహదపడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దేశాభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషింస్తోందని అన్నారు. మీ సేవల్లో వీలైనంత వరకు ఏఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా వినియోగించాలని సంస్థలకు సూచించారు మంత్రి. సికింద్రాబాద్, సిక్ విలేజ్, గాయత్రీ గార్డెన్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ 2024 సమ్మిట్ ఆదివారం జరిగింది. ఇందులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఏఐతో ఎన్నో సేవలను చిట్టచివరి లబ్ధిదారునికి కూడా అందడం సులభతరమైందన్నారు. ఏఐ టెక్నాలజీ అంటే కేవలం ఆయుధాలు, ఆటోమొబైల్స్‌లోనే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తోందని, ఏఐ టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం లబ్ధిదారులు విస్తత సేవలందించడం ప్రభుత్వానికి సులభమైందని అన్నారు.

కరోనా సమయంలో అద్భుతం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసిన వేళ ఈ ఏఐ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు మంత్రి కిషన్ రెడ్డి. వంట గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవడం, డెలివరీ ట్రాకింగ్, బిల్ పేమెంట్ చేయడం వంటి ఎన్నో సేవలను అందించడంలో ఇప్పటికే ఏఐ తన మార్క్ చూపిస్తోంది. ఎనర్జీ సెక్టార్‌లో స్థిరత్వం కోసం ప్రభుత్వాలు లాంగ్-టర్మ్ కమిట్‌మెంట్ పూర్టి చేయడంలో సహకారం చాలా కీలకమని అన్నారు. ‘‘కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ దీటుగా ప్రజలకు ఇంటిదగ్గరకే సిలెండర్లు అందించారు. వచ్చే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోంది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. భారత్‌లో యువశక్తి అధికంగా ఉంది. వారిని వినియోగించికుని ప్రపంచంలోనే అగ్రస్థానానికి భారత్ ఎదగాలి. ఇందుకు యువతతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ భాగస్వామ్యం కావాలి’’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణం అప్పుడే సాధ్యం

‘‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం విజయవంతం కావడం వెనక ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్న వారు కీలకం. వారిని ఎంతగానో అభినందించాలి. ఈ వేదిక ద్వారా సబ్దిడీ వదులుకున్న వారందరికీ మరోసారి ధన్యవాదాలు. వారి కారణంగా పేదలకు ఉచితంగా, మధ్యతరగతివారికి సబ్దిడీతో సిలెండర్లు అందించడం సాధ్యమైంది. సమాజ భాగస్వామ్యంతో దేశాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ. తన తోటివారికి ఎంత సహాయం చేస్తాం అనేది మన దగ్గరున్న సంపదకు కొలమానం. డబ్బులు ఉన్నవారు పేదలకు ఇలాంటి సహాయం చేస్తున్నప్పుడే మనం బలమైన, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించుకోగలం’’ అని కిషన్ రెడ్డి వివరించారు.

Tags:    

Similar News