ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ ఫిర్యాదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ప్రజావాణిలో ఫిర్యాదు నమోదు చేశారు. తన ఇంటి స్థలం గురించే ఆయన ఈ ఫిర్యాదు అందించారు.;

Update: 2025-02-10 10:17 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ప్రజావాణిలో ఫిర్యాదు నమోదు చేశారు. తన ఇంటి స్థలం గురించే ఆయన ఈ ఫిర్యాదు అందించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ఆస్తుల విషయంపై పునరాలోచన చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని అన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటివైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఆయన ఫిర్యాదును అధికారులు స్వీకరించారు. దీనిని సంబంధిత శాఖ అధికారులకు అందిస్తామని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం.

అయితే ఇటీవల కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే రోడ్లను విస్తరించాలని భావించారు. అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రోడ్డు విస్తరణతో పాటు పలు ఇతర కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ రెడ్డి.. ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News