Allu Arjun | అల్లు అర్జున్‌ను అడ్డుకున్న పోలీసులు

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి కేసులో నిందితుడైన సినీనటుడు, పుష్ప హీరో అల్లు అర్జున్ ను రాంగోపాల్ పేట పోలీసులు మరోసారి అడ్డుకున్నారు.;

Update: 2025-01-05 06:22 GMT

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజను పరామర్శించడానికి ఆదివారం కిమ్స్ ఆసుపత్రికి వెళుతున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.

-కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు.అల్లు అర్జున్ ఆదివారం ఉదయాన్నే నిద్రలేవక పోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆసుపత్రికి వెళితే పెద్ద సమస్య ఏర్పడుతుందని, అక్కడ ఏదైనా జరిగితే అల్లు అర్జునే బాధ్యత వహించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లరాదని పోలీసులు నోటీసుల్లో కోరారు. దీంతో అల్లు అర్జున్‌ కిమ్స్‌ ఆస్పత్రి విజిట్‌ ను రద్దు చేసుకున్నారు.
బెయిలుపై ఉన్న అల్లు అర్జున్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆదివారం ఉదయం చిక్కడపల్లి పోలీసుస్టేషనుకు విచారణకు వచ్చారు. పోలీసుల సూచనలతో కిమ్స్ ఆసుపత్రి సందర్శనను రద్దు చేసుకున్న అల్లు అర్జున్ పోలీసుస్టేషనుకు వచ్చి సంతకం చేసి మాట్లాడి వెళ్లారు.


Tags:    

Similar News