‘నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే’

సంధ్య థియేటర్ ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు.;

Update: 2024-12-21 15:24 GMT

సంధ్య థియేటర్ ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలే అని కొట్టి పారేశారు. పోలీసులు, అధికారులు అందరూ ఎంతో కష్టపడి పనిచేసినా సంధ్య థియేటర్ దగ్గర ఆ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పారు. ఈ ఘటనలపై ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒక్కరోజు అరెస్ట్ అయిన అర్జున్‌ను పరామర్శించడానికి సెలబ్రిట్రీలు ఆయన ఇంటి ముందు క్యూలు కట్టారని, కానీ ఆసుపత్రిలో చావుతు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న శ్రీతేజను ఒక్కరంటే ఒక్కరు కూడా చూడటానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను సీఎంగా ఉన్నంత కాలం తెలంగాణలో ఏ సినిమాకు ప్రీమియర్స్, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించారు.

‘‘నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్‌కు కొద్ది దూరంలో రద్దీ ఎక్కువ కావడంతో కారు అక్కడే ఆగిపోయి.. ముందుకు కావడం లేదు. దాంతో నేను బయటకు వచ్చి ముందుకు కదలండి అంటూ సైగ చేశాను. థియేటర్ లోపలికి వెళ్లిపోయిన తర్వాత ఏ పోలీసు కూడా లోపలకు వచ్చి నాకు జరిగింది చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెబితే నా భార్యతో కలిసి బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు వరకు తెలియలేదు. అందుకే వెళ్లే సమయంలో కూడా నేను బయటకు వచ్చి ముందు వెళ్లాలంటూ ఫ్యాన్స్‌కు సైగలు చేశాను. విషయం తెలిసిన తర్వాత నాకు బన్నీ వాసు ఫోన్ చేశాడు. ఆసుపత్రికి వెళ్లి పిల్లాడి పరిస్తితి తెలుసుకోమని చెప్పాను. నేను కూడా థియేటర్‌కు వెళ్దామని రెడీ అయ్యా కానీ. అప్పటికే నాపై కేసు పెట్టారని, వస్తే మరింత క్రౌడ్ వచ్చి ఇంకా గందరగోళం అవుద్ది అన్నారు. అయినా పర్లేదు.. వస్తా అన్నాను. కానీ నా లీగల్ టీమ్ వద్దని చెప్పింది. కేసు పెట్టారు.. ఇప్పుడు వెళ్లడం రూల్స్ ప్రకారం కరెక్ట్ కాదని చెప్పింది. అందుకే ఆగిపోయను’’ అని బన్నీ వివరణ ఇచ్చాడు.

Tags:    

Similar News