మిస్ వరల్డ్ -2025 పోటీల్లో టాప్ 20 ఫైనలిస్టుల ప్రకటన

హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ పోటీలు తుదిదశకు చేరాయి.హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీల్లో 20 మంది ఫైనలిస్టులను నిర్వాహకులు ప్రకటించారు.;

Update: 2025-05-23 08:24 GMT
మిస్ వరల్డ్ టాప్ ఫైనలిస్టుల ఎంపిక

తెలంగాణలో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ కోసం 20 మంది ఫైనలిస్టులను నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ అందాల భామల వాయిస్,వారి దృష్టి , ఉద్దేశాలను బట్టి టాప్ 20 సుందరీమణులను ఎంపిక చేశారు. తెలంగాణలో జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి రౌండ్ తర్వాత ప్రతిష్ఠాత్మక హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 20 మంది ఫైనలిస్టులను 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ ప్రకటించింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్ 20 అందాల భామల ఎంపిక అందరినీ ఆకట్టుకుంది.




 భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం తెలంగాణ సాంస్కృతిక వైభవం మధ్య జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 107 మంది అందాల భామలు వారి టాలెంట్ ను ప్రదర్శించి టాప్ 20 అందాలభామల్లో చోటు దక్కించుకున్నారు.20 మంది ఫైనలిస్టులైన అందాల భామలు వాగ్ధాటి, తెలివితేటలను మాత్రమే కాకుండా ధైర్యాన్ని కూడా ప్రదర్శించారు. ఈ యువతులు మార్పు కోసం తమ గొంతులను ఉపయోగించడానికి అచంచలమైన అంకితభావంతో నిలిచారు.




 యూరప్ ప్రాంతం నుంచి:

• స్పెయిన్ - కొరినా మ్రాజెక్
• వేల్స్ - మిల్లీ-మే ఆడమ్స్
• ఫ్రాన్స్ - అగాథే కౌట్
• జర్మనీ - సిల్వియా డోర్రే సాంచెజ్
• ఐర్లాండ్ - జాస్మిన్ గెర్హార్డ్ట్

అమెరికా & కరేబియన్ ప్రాంతం నుంచి:
• బ్రెజిల్ - జెస్సికా పెడ్రోసో
• సురినామ్ - చెనెల్లా రోజెండాల్
• కేమాన్ దీవులు - జాడా రామూన్
• గయానా - జాలికా శామ్యూల్స్
• ట్రినిడాడ్ మరియు టొబాగో - అన్నా-లిస్ నాంటన్

ఆసియా & ఓషియానియా ప్రాంతం నుంచి:
• శ్రీలంక - అనుడి గుణశేఖర
• థాయిలాండ్ - ఓపాల్ సుచాటా చువాంగ్‌స్రీ
• తుర్కియే - ఇడిల్ బిల్జెన్
• లెబనాన్ - నాడా కౌస్సా
• జపాన్ - కియానా టోమిటా

ఆఫ్రికా ప్రాంతం నుంచి:

• దక్షిణాఫ్రికా - జోలిజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్
• నమీబియా - సెల్మా కార్లిసియా కమన్యా
• సోమాలియా - జైనాబ్ జామా
• ఉగాండా - నటాషా న్యోనియోజి
• జాంబియా - ఫెయిత్ బ్వాల్య



 ముగింపు రౌండులో 20 మంది

టాప్ 20 ఫైనలిస్టులందరూ మిస్ వరల్డ్ ముగింపు రౌండ్‌లో మరోసారి పాల్గొంటారు.తుది పోటీల్లో అంతిమ విజేతను నిర్ణయించనున్నారు.‘‘హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రతి యువతి పట్ల నాకు చాలా గర్వంగా ఉంది ’’ అని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ జూలియా మోర్లీ చెప్పారు. అందాలభామల స్వరాలు, ధైర్యం, ప్రేరణతో ప్రతిధ్వనించాయని చెప్పారు.



Tags:    

Similar News