ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మంగళవారం మరో మృతదేహం లభించింది.టన్నెల్ కూలిన ప్రాంతంలో మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించిందని సహాయ సిబ్బంది చెప్పారు.;
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయ పనులను ముమ్మరం చేశారు. మంగళవారం టన్నెల్ లోపల సహాయ పనులు చేస్తున్న సిబ్బందికి కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది. మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం వెలుగుచూసిందని ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ అధికారి చెప్పారు. రెస్క్యూ బృందాలు మంగళవారం మృతదేహాన్ని వెలికితీయడంతో ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభించినట్లయింది. గతంలో గుర్ ప్రీత్ సింగ్ మృతదేహం మార్చి 9వ తేదీన లభ్యమైంది.మంగళవారం లభించిన మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది. ఫిబ్రవరి 22వతేదీన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది కార్మికులు జాడ లేకుండా పోయారు.
మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని బయటకు తీసుకువస్తాం : అర్వింద్ కుమార్
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జాడ లేకుండా పోయిన వారిలో ఒక మృతదేహాన్ని తమ సహాయ సిబ్బంది గుర్తించిందని తెలంగాణ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు టన్నెల్ నుంచి బయటకు తీసుకువస్తామని ఆయన చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చాక ఎవరిదనేది గుర్తిస్తామని ఆయన తెలిపారు.
సహాయ చర్యల్లో 25 ఏజెన్సీలు