హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం

బాలాపూర్ ప్లాస్టిక్ పరిశ్రమలో;

Update: 2025-07-28 09:54 GMT

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలతో పలువురు కలవరం చెందుతున్నారు. గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది అహుతి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలాపూర్‌లోని ప్లాస్టిక్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్లాస్టిక్ గోడౌన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. పరిశ్రమలో ప్లాస్టిక్ దహనమైపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనావేస్తున్నారు.

Tags:    

Similar News