ఆర్టీసీలో పోస్టుల భర్తీ

నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పోలీసు నియామక మండలి.;

Update: 2025-09-17 13:00 GMT

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీని చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. మొత్తం 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఖాళీలకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS కేటగిరి వారికి 5 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌‌మెన్‌ అయితే 3ఏళ్లు వయో పరిమితి సడలింపు ఉంటుంది. 

స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు మండలి తెలిపింది. దరఖాస్తులను https://www.tgprb.in/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Tags:    

Similar News