హైడ్రాపై అరికెపూడి ఫైర్

స్వంత పార్టీలో భిన్న స్వరం;

Update: 2025-06-30 10:03 GMT

శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ హైడ్రాపై సంచలన కామెంట్ చేశారు హైడ్రా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తుందన్నారు. మాదాపూర్ సున్నంచెరువు కూల్చివేతలపై అరికెపూడి ఫైర్ అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే హైడ్రా కూల్చివేతలు చేస్తుందన్నారు.

సున్నం చెరువు కూల్చివేతల గూర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెస్తానని అన్నారు. హైడ్రా తీరును ఆయన తప్పు పట్టారు. చెరువులు కబ్జాలకు గురి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు అధికారాలు ఇచ్చారని, అయితే హైడ్రా కూల్చివేతల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై స్వంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారా? ఉనికి కోసం పాటుపడుతున్నారా? హైడ్రాకు వ్యతిరేకంగా ఇటీవలె నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ వేసి సంచలనం సృష్టించారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి హైడ్రాను నిందించడం చర్చనీయాంశమైంది. అరికెపూడిగాంధీ బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే అరికెపూడి హైడ్రాపై విమర్శలు చేయడం ప్రతిపక్ష పార్టీలకు అవకాశంగా మారింది. 

సున్నం చెరువులో బఫర్ జోన్ చేయకుండానే హైడ్రా కూల్చివేయడాన్నిస్థానికులు అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. హైడ్రా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారన్నారు. హైడ్రా తీరువల్ల  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి  చెడ్డ పేరు వస్తుందన్నారు.

Tags:    

Similar News