17 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ ?

బకాయిలు చెల్లించాలని ప్రయివేటు హాస్పిటల్స్ యాజమాన్యాల అల్టిమేటం;

Update: 2025-09-15 11:59 GMT

ఈ నెల 17 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేయాలని ప్రయివేటు ఆస్పత్రులు నిర్ణయించాయి.వందల కోట్ల రూపాయల బకాయిలు  చెల్లించని కారణంగా ఆరోగ్య సేవలు నిలిపి వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్య శ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ పథకం ద్వారా ఐదులక్షల వరకు ఉచిత వైద్య సాయం అందేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ మొత్తాన్ని 10 లక్షలకు పెంచింది. అయితే ప్రయివేటు నెట్ వర్క్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. దాదాపు 1000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆగస్టు చివరి వరకు బకాయిలు తీర్చాలని, లేని పక్షంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రయివేటు హాస్పిటల్స్ హెచ్చరించాయి. ఆగస్ట్ చివరి కల్లా బకాయులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా,   సెప్టెంబర్ లో రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య సేవలు బుధవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించాయి.

ఆరోగ్య సేవలు నిలిచిపోతే పేదరోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు క్లియర్ చేయడం లేదా ప్రయివేటు హాస్పిటల్స్ తో ప్రభుత్వం చర్చలు జరిపితే సమస్య పరిష్కారం కనబడుతుంది.ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్దమైనట్లు సమాచారం. 

Tags:    

Similar News