హైదరాబాద్ లో చిక్కిన చిరుత

మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్కు వద్ద..;

Update: 2025-07-31 17:16 GMT

హైదరాబాద్ లో చిరుత సంచారం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గత 20 రోజులుగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను గడగడలాడిస్తున్నచిరత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గండిపేట, మొయినాబాద్, షేక్‌పేట మండలాల్లో స్థానికులకు కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు గురువారం చిక్కింది. సురక్షిత ప్రాంతాలను ఎంచుకొనే క్రమంలో సంచరిస్తూ అటవీ అధికారులకు చిరుత సవాల్‌ విసిరింది. మంచిరేవుల ఫారెస్ట్‌ టెక్‌ పార్క్‌లో ఏర్పాటు చేసి ఆటవీశాఖాధికారులు అమర్చిన బోనులో చిరుత చిక్కింది. అక్కడ్నుంచి అటవీశాఖ అధికారులు చిరుతను జూపార్క్‌కు తరలించారు.హైదరాబాద్‌లోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టెక్‌ పార్కులో గత వారం ఒక అధికారికి కనిపించి.. ఆ తర్వాత కనపడకుండా పోయింది. చిరుత కనిపించకపోవడంతో అందరిలో భయం మొదలైంది. గత సోమవారం గోల్కొండ సమీపంలో ఇదే చిరుత సంచరించినట్టు ఆటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఎనిమిదిట్రాప్ కెమెరాలు, నాలుగు బోనులను అమర్చారు.

ఈ ఒక్క జులై నెలలో నాలుగుసార్లు హైదరాబాద్ లో చిరుత కనిపించింది. ఇమ్మారత్ రీసెర్చి లేబరేటరీలో చిరుత కనిపించినట్టు వాచ్ మెన్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. ఆటవీ శాఖాధికారులు అప్రమత్తమై ట్రాప్ కెమెరాలు అమర్చినప్పటికీ చిరుత జాడ దొరకలేదు. దీంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువైంది. స్థానికంగా కుక్కలను వేటాడి తింటున్నట్టు స్థానికులు చెప్పారు. కుక్క కళేబరాలు కనిపించడంతో చిరుత ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి.మరో సారి చిరుత చిల్కూరులో చిరుత కనిపించింది. బిగ్ క్యాట్ అని తొలుత భావించారు. ఇబ్రహీం బాగ్ విలేజ్ మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతుండగా ట్రాప్ కెమెరాల్లో చిక్కుక్కుంది. అప్పుడు చిల్కూరులో కనిపించింది పెద్ద పిల్లి కాదు చిరుత అని ఆటవీశాఖాధికారులు కన్ఫర్మ్ చేశారు.

గత సంవత్సరం చిరుత సంచారం శంషాబాద్ లో వెలుగు చూసింది. ఎయిర్ పోర్టులో చిరుత సంచారం కెమెరాల్లో రికార్డయ్యింది. మే మాసంలో ఈ ఘటన జరిగినప్పటికీ చిరుత జాడ దొరకలేదు. 14 నెలల తర్వాత హైదరాబాద్ లో చిరుత కనిపించడంతో అధికారులు, నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. టెక్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చే వాకర్స్ 20 రోజుల నుంచి రావడం లేదు. చిరుతను టెక్ పార్కులో బంధించినప్పటికీ స్థానికంగా భయం ఇంకా తొలగి పోలేదు. గత రెండేళ్ల నుంచి హైదరాబాద్ శివారు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, చిల్కూరు, బాలాపూర్ ఇమ్మారత్ వద్ద సంచరించిన చిరుతల్లో ఏ చిరుత దొరికిందో అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

సంచారం పెరుగుతోంది తప్ప సంతానం కాదు

‘‘చిరుత పులుల సంచారం పెరుగుతుందిపులుల సంతానం పెరగలేదు అని

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ సువర్ణ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.

మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తున్నాయని,

మహబూబ్ నగర్ లో రెండు చోట్ల చిరుత పులులు సంచరిస్తున్నాయి అని ఆమె చెప్పారు.

మనుషుల మీద దాడులు ఎక్కువగా చేస్తున్నాయని.చిలుకూరు ప్రాంతంలో ఉన్న చిరుతను పట్టుకున్నామని ఆమె చెప్పారు.

గతంలో ఒక చిరుతను పట్టుకోవాలాంటే మూడు నెలలు పట్టింది చిలుకూరు లో.

ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయసంగా చిరుతను పట్టుకున్నం

వాకర్స్ కూడా సహకరించారు అని సువర్ణ తెలిపారు.

చిక్కిన చిరుత వయసు ఐదు సంవత్సరాలు

పులి కంటే చిరుతపులి తెలివైంది ఫారెస్ట్ సీనియర్ ఆఫీసర్ శంకరన్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. చిరుత ORR వద్ద రెండు సార్లు దాటిందని,ఇప్పటి వరకు ఎవరిపైనా దాడి చేయలేదని ,ఆ తర్వాత అది ఫారెస్ట్ లోకి వెళ్ళింది అని ఆయన తెలిపారు

నగరంలో చుట్టూ పక్కల అటవీ ప్రాంతం అంతరించింది

అడవిలో సరైన ఆహారం దొరక్కపోతే బయటకి వస్తాయన్నారు.

జంతువులు, మానవులపై ఎక్కువ దాడి చేసే అవకాశం ఉంది అని ఆయన తలిపారు.

ఈ రోజు చిక్కిన చిరుత మగ, 5 సంవత్సరాల వయస్సు ఉంటుంది అని ఆయన అన్నారు.

ఈ ఒక్క చిరుతకే ఇంత సమయం పట్టిందని.రాష్ట్రంలో ఇంకా తిరుగుతున్నాయని ఆయన అన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూడు వారాల తర్వాత ఈరోజు మంచిరేవుల లో చిరుత చిక్కిందని, క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే పది లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.కానీ విషం పెట్టీ వీటిని చంపొద్దని, చంపితే అటవీ చట్టం కేసులు నమోదు అవుతాయని శంకరన్ తెలిపారు.

Tags:    

Similar News