స్మగుల్డ్ లగ్జరీ కార్లతో కారు పార్టీ నడుస్తోందా?

మాజీ మంత్రి కేటీఆర్ కు ఎక్స్ లో పలు ప్రశ్నలు సంధించిన కేంద్రమంత్రి బండి సంజయ్

Update: 2025-09-22 08:17 GMT

కారు పార్టీ బీఆర్ఎస్‌ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌కి పలు ప్రశ్నలు సంధించారు.కేటీఆర్ లక్ష్యంగా బండి విసిరిన ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో మరో చర్చకు దారితీశాయి.

లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు?. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని బండి ప్రశ్నించారు.మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని బండి సంజయ్‌ అన్నారు. పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా? అని ప్రశ్నించారు.
ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని బండి సంజయ్‌ అన్నారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇప్పుడు బీఆర్ఎస్ లక్ష్యంగా సంధించిన ప్రశ్నలు అనేక అనుమానాలకు దారితీస్తుండగా ,దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించాల్సి వుంది.అయితే గతంలో తనపై బండి చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెల్సిందే.
Tags:    

Similar News