బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో మొదలైన ధర్నా..
దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.;
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఇక కేంద్రం ఆమోదం అండమే మిగిలి ఉంది. కాగా ఇందుకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో ఎలాగైనా కేంద్రం మెడలు వంచి 42శాతం రిజర్వేషన్లు అందుకోవాలని బీసీ సంఘాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు ధర్నా షురూ చేశాయి. ఈ ధర్నాలు తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.
వీరితో పాటుగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, తమిళనాడు ఎంపీ కనిమొళి, మహారాష్ట్ర ఎంపీ సుప్రియ సూలే తదితరులు కూడా పాల్గొని.. బీసీ సంఘాల ధర్నాకు తమ మద్దతు పలికారు. మరి వీరి ధర్నాకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేని కీలకంగా మారింది. ఇదే సమయంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో కూడా లేవనెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీల అభ్యున్నతి కోసం కేంద్రం కూడా ఈ రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని జంతర్ మంతర్‌లో చేస్తున్న ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.