బేగంపేట ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
అలర్ట్ అయిన భధ్రతా బలగాలు;
By : B Srinivasa Chary
Update: 2025-06-18 13:09 GMT
బేగంపేట ఎయిర్ పోర్ట్ బాంబు కు బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బాంబులు ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. అప్రమత్తమైన ఎస్ పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఇతర బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఉద్యోగులను బయటకు పంపించి పోలీసులు తనిఖీలు చేశారు. . ఎయిర్ పోర్ట్ ను పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్నిప్పర్ డాగ్స్ ను రంగంలో దింపి ఏమి లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు సమాచారమిచ్చిన వారిని అరెస్ట్ చేయడానికి సైబర్ క్రైం పోలీసులు రంగంలో దిగారు.