తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి పలువురు ప్రముఖులు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేశారు.

Update: 2024-11-08 06:55 GMT

ముఖ్యమంత్రి జన్మదినం సందర్బంగా రేవంత్ రెడ్డి కి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కేంద్రజాతీయ రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవనం సాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ పోస్టులో ఆకాంక్షించారు. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు.
- తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పోలీసులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, కాంగ్రెస్ నేతలు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర
సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు. జన్మదినం వేడుకల అనంతరం రేవంత్ రెడ్డి శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష
బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలయంలో పూజలు చేశాక యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షించారు. అనంతరం సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్పంతో సీఎం పాదయాత్ర చేశారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు 2.5 కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశారు.



Tags:    

Similar News