Pushpa|బిగ్ బ్రేకింగ్ అల్లు అర్జున్ అరెస్టుకు బీజేపీ ఎంఎల్ఏ డిమాండ్
సినిమాకు సంబంధించి బీజేపీ ఆర్మూరు ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి(BJP Armur MLA Pydi Rakesh Reddy) చేసిన డిమాండ్ సంచలనంగా మారింది.
రిలీజ్ కాకుండానే పుష్ట-2 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. బెనిఫిట్ షోల పేరుతో టికెట్ల ధరలు విపరీతంగా పెంచేయటం పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదంపై కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఈ వివాదం కోర్టులో ఉండగానే సినిమాకు సంబంధించి బీజేపీ ఆర్మూరు ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి(BJP Armur MLA Pydi Rakesh Reddy) చేసిన డిమాండ్ సంచలనంగా మారింది. ఇంతకీ పైడి ఏమన్నారంటే వెంటనే హీరో అల్లు అర్జున్(Allu Arjun), దర్శకుడు సుకుమార్ను(Director Sukumar) అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే సినిమాలో అంతా అబద్ధాలనే చూపించారట.
ఇంతకీ విషయం ఏమిటంటే ఎర్రచందనం(Red Sanders) టన్ను రు. 10 లక్షలుంటే కోటిరూపాయలు ఉన్నట్లు పుష్పసినిమాలో చూపించారట. దీనివల్ల యువకులు కోట్లాది రూపాయలు సంపాదించాలన్న ఆశతో లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్లు పైడి ఆరోపించారు. పుష్ప సినిమా మొదటి పార్ట్ వల్లే అంతటి అనర్ధం జరిగితే ఇక పుష్ప-2(Pushpa-2) కూడా రిలీజయితే ఇంకెన్నిఅనర్ధాలు జరుగుతాయో అని ఎంఎల్ఏ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సినిమాతో యువత పాడైపోతున్నట్లు చెప్పారు. అందుకనే సినిమాలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ను అరెస్టుచేసి జైలులో వేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమాజాన్ని చెడగొట్టే పుష్ప-2 సినిమాను రిలీజ్ కూడా చేయవద్దని పైడి రాకేష్ డిమాండ్ చేశారు.