టన్నెల్‌లో వెలికితీసిన శవం యూపీకి తరలింపు, రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో సహాయ సిబ్బంది వెలికితీసిన మృతదేహం యూపీకి చెందిన మనోజ్ కుమార్దిగా గుర్తించారు.మనోజ్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి అంబులెన్సులో పంపించారు.;

Update: 2025-03-25 12:07 GMT

ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మంగళవారం ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో దొరికిన మృత దేహం ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్ కుమార్ దిగా గుర్తించారు. టన్నెల్ లోపల మంగళవారం సహాయ పనులు ముమ్మరం చేయగా ఓ మృతదేహం బయటపడింది.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామం లోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో మార్చి 9వ తేదీ ఆదివారం రాత్రి పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది.



 మృతుడి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా

మంగళవారం మంగళవారం జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంజనీర్ గా విధులు నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్జున్ ప్రసాద్ కుమారుడు మనోజ్ కుమార్ మృతదేహం గా గుర్తించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు సంతోష్ ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం మృత దేహాన్ని యూపీలోని వారి స్వగ్రామానికి తరలించారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా బంగార్మౌ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ కు భార్య స్వర్ణలత,కుమారుడు ఆదర్శ్ ,కుమార్తె శైలజ ,తల్లి జమున దేవి ఉన్నారని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News