సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు..

ప్రజలు, సిబ్బంది, న్యాయవాదులను బయటకు తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు.;

Update: 2025-07-08 06:55 GMT

పాతబస్తీలోని సిటీ సివిల్ న్యాయస్థానికి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బ్లాస్ట్ చేసేస్తామని దుండగులు బెదిరింపులు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోర్టు మొత్తాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. ప్రజలు, సిబ్బంది, న్యాయవాదులను బయటకు తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అదే విధంగా డాగ్ స్క్వాడ్, బాంబు డిఫ్యూసింగ్ స్కాడ్‌తో కోర్టు మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అన్న అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News