కొట్టేయడం కుదరకపోవడంతో కుట్రలు.. HCU వివాదంపై పొంగులేటి
నాలుగు రోజులుగా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందుతున్నారంటూ పొంగులేటి మండిపడ్డారు.;
HCU భూముల వివాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొట్టేయడం కుదరకపోవడంతోనే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లు కుట్రలు చేస్తున్నారని చురకలంటించారు. నాలుగు రోజులుగా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందుతున్నారంటూ పొంగులేటి మండిపడ్డారు. మంగళవారం సెక్రటేరియట్‌లో హెచ్‌సీయూ భూముల వివాదంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క్, మంత్రులు శ్రీధర్ బాబుతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 400 వందల ఎకరాల చుట్టూ ఉన్న ఫెవికాల్ బంధాలను తెంచుకోలేక అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
‘‘గత పదేళ్లు వారికి చెందిన వ్యవస్థలకు చెందడం కోసం ఆనాటి పెద్దలు ప్రయత్నం చేశారు. 400 ఎకరాలకు చుట్టూ హైరేజ్ భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారు? అంత పెద్ద భవనాలు నిర్మించినప్పుడు పర్యావరణాకి నష్టం జరుగుతుందని ఆలోచన లేదా? జంతువులు నష్టపోతున్నాయి లేని పోనీ చిత్రాలను చూపిస్తున్నారు. ఆనాడు 400 ఎకరాలు కొట్టేయాలని చూసినా కుదరకపోవడంతో ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు. HCU పెట్టాలని ఆలోచన సోనియా గాంధీకి...వస్తె అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు HCU ఓల్డ్ స్టూడెంట్స్. HCU భూములకు, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఇద్దరూ సీఎంతో మాట్లాడారు. 2022లో యూనివర్సిటీ భూమి నుంచి రోడ్ వేసేటప్పుడు VC కోర్టుకు వెళ్తే యూనివర్సిటీ కి హక్కు లేదని కోర్టు చెప్పింది’’ అని గుర్తు చేశారు.
‘‘HCU భూమికి టైటిల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ముసుగులో ACP నీ కొట్టారు...విద్యార్థులు మంచివాళ్ళు. HCU లో విపక్షాలు కిరాయి వ్యక్తులను పెట్టారు. గత ప్రభుత్వంలో TNGO లకు ఇచ్చిలో భూమిలో 25 ఎకరాలు కబ్జాకు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వచ్చాక అడ్డుకుంది. పదేళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజలు మీకెళ్లి చూస్తారు’’ అని అన్నారు.