తెలంగాణ పాటలతో దద్దరిల్లిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ తెలంగాణ పాటలతో దద్దరిల్లింది.;
By : The Federal
Update: 2025-04-27 13:18 GMT
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ తెలంగాణ పాటలతో దద్దరిల్లింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ వచ్చే ముందు నాలుగు గంటల పాటు తెలంగాణ కళాకారుల బృందం వివిధ పాటలతో ప్రేక్షకులను అలరించింది. ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జన సంద్రంగా మారింది. కళాకారుల ఆటపాటలకు జనం కరతాళ ధ్వనులు చేశారు.
హెలికాప్టరులో వచ్చిన కేసీఆర్
గులాబీ దళపతి, తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టరులో ఎల్కతుర్తి సభా వేదిక వద్దకు వచ్చారు. కేసీఆర్ కు పల్లా రాజేశ్వర్ రెడ్డిపాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ హెలికాప్టరు నుంచే పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఒక వైపు జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మారుమోగుతుండగా కేసీఆర్ సభా వేదికపైకి చేరుకున్నారు.
కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేసేందుకు
— BRS Party (@BRSparty) April 27, 2025
పోరాటాల పురిటి గడ్డ.. ఓరుగల్లు గడ్డ మీద
అడుగుపెట్టిన గులాబీ దళపతి కేసీఆర్ 🦁🔥#BRSat25#25YearsOfBRS pic.twitter.com/l5XFjVkJoH
నినాదాలతో మారుమోగిన సభ ప్రాంగణం
బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపైకి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వచ్చినపుడు కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేశారుజై కేసీఆర్… జై కేటీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. పోరుగల్లు దారిలోన.. తరలింది తెలంగాణ, సమ్మక్క సారక్క జాతరోలె.. గులాబీ జాతరకు పోటెత్తిన తెలంగాణ అంటూ పాటలు పాడుకుంటూ గులాబీ దండు తరలివచ్చింది. గులాబీ దండు రాకతో పోరాటాల పురిటి గడ్డ ఓరుగల్లు పులకరించిపోయింది. కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేసేందుకు పోరాటాల పురిటి గడ్డ.. ఓరుగల్లు గడ్డ మీద గులాబీ దళపతి కేసీఆర్ అడుగుపెట్టారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు.
జాతరను తలపించిన ఎల్కతుర్తి సభా ప్రాంగణం
ఎల్కతుర్తి తొవ్వలు జాతరను తలపించాయి. కేసీఆర్ కోసం పల్లె, పట్నం కదిలివచ్చినట్లయింది.‘‘దిమాఖ్ ఉన్నోడు అందరివాడు మా కేసీఆర్ నీలాంటివోడు ఒక్కడుంటే నువ్వే నువ్వే రావాలయ్యా మా దేవుడు నీవే రావాలయ్యా’’అంటూ పాటలతో కళాకారులు జనంలో ఊపు తీసుకువచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఉర్రూతలూగించారు. ఓ వేదికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, రాష్ట్ర నాయకులు కూర్చున్నారు.