మొదలైన తెలుగు ముఖ్యమంత్రుల భేటీ..

తెలంగాణ ప్రతిపాదనకు కేంద్ర ఓకే చెప్పిందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-07-16 10:36 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించనున్నారు. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశం అజెండా నుంచి గోదావరి-బనకచర్ల అంశాన్ని తొలగించాలని, దానిపై చర్చించే పనయితే తాము సమావేశానికే రామని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఢిల్లీలో భేటీలో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ ప్రతిపాదనకు కేంద్ర ఓకే చెప్పిందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

సమావేశం అజెండాలో తొలుత ప్రతిపాదించినట్లే గోదావరి-బనకచర్ల సహా 10 అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశానికి ముందు సీఎంలు ఇద్దరూ ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. అందులో భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. సీఎంల అధికారిక నివాసాల్లో ఈ సమావేశాలు దాదాపు గంటన్నరపాటు జరిగాయి.

Tags:    

Similar News