World Class Terminal |చర్లపల్లి రైల్వేస్టేషన్ @వరల్డ్ క్లాస్ సౌకర్యాలు

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను సోమవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.రూ.413 కోట్లతో నిర్మించిన స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.;

Update: 2025-01-06 04:32 GMT

చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చర్లపల్లిలో రూ.413 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన స్టేషన్ రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.

- సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లతోపాటు చర్లపల్లి స్టేషన్ 9 ఫ్లాట్ ఫాంలతో ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
- వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టులు, ఎస్కలేటర్లు, ఎయిర్ కండీషన్ వెయిటింగ్ రూంలతో వరల్డ్ క్లాస్ టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రపంచ స్థాయి అధునాతన సౌకర్యాలతో కూడిన చర్లపల్లి స్టేషన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.



 చర్లపల్లి నుంచి మూడు రైళ్లు

చర్లపల్లి- సికింద్రాబాద్ మార్గంలో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంతో హైదరాబాద్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం రైళ్లు కూడా నడపాలని యోచిస్తున్నారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు.

పలు రైళ్లకు చర్లపల్లిలో హాల్టు
చర్లపల్లి రైల్వేస్టేషనులో డెల్టా ఎక్స్ ప్రెస్, కృష్ణా, గుంటూరు సూపర్ ఫాస్ట్ ఇంటర్ సిటీ, శబరీ, శాతవాహన, రేపల్లె, కాకతీయ,సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్టు సౌకర్యం కల్పించారు.


Tags:    

Similar News