బాపు ఘాట్ వద్ద జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి స్వగ్రామంలో దసరా వేడుకలు
గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సర్వ మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. గాంధీజి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి స్వంత జిల్లాకు
దసరా వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డి పల్లికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి గ్రామానికి చేరుకున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి దసరా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ కమిటీ చైర్మన్ అనుముల కృష్ణారెడ్డి ఆధ్వ ర్యంలో వేడుకలు జరిగాయి. శమీ పూజ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో గడిపారు. రాత్రి స్వంత నియోజకకవర్గం కొడంగల్ లో బస చేయనున్నారు.