వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం..

ములుగు పర్యటనలో సీఎం రేవంత్.

Update: 2025-09-23 08:21 GMT

సమ్మక్క-సారలమ్మ అమ్వార్ల గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి.. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగానే వనదేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు రేవంత్. అనంతరం తన మొక్కులు చెల్లించుకున్నారు. రేవంత్ రెడ్డికి అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మరికాసేపట్లో మేడారం ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులను సీఎం సమీక్షించనున్నారు. అంతేకాకుండా ఆలయ ఏర్పాట్లను పరిశీలించి, వాటిపై అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. 

మేడారం ఆలయ అభివృద్ధి, విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరిక్షిస్తూ విస్తరణ చేపట్టాలని తెలిపారు. అనంతరం సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం విస్తరణ, పునఃనిర్మాణం చేయనున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ మేరకు అమ్మవార్లకు సీఎం రేవంత్ రెడ్డి 68 కేజీల బంగారం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News