‘జూబ్లీహిల్స్ బరిలో గెలుపు గుర్రాన్ని నిలబెట్టాలి’
ముగిసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అదే దారిలో కాంగ్రెస్ కూడా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి, ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసేసింది. కాంగ్రెస్ మాత్రం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిలబడే తమ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ లేకుండా ఉంది. ఈ క్రమంలోనే ఈ అంశంపై చర్చించడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం భేటీ అయ్యారు. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని వారు ముగ్గురు మంత్రులకు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులను, నియోజకవర్గంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. తమకు ఇచ్చే నివేదికలో అభ్యర్థులు పేర్లు, పూర్తి వివరాలు ఉండాలని సీఎం.. మంత్రులకు సూచించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో గెలుపు గుర్రాన్ని నిలబెట్టాలని సీఎం రేవంత్.. ఈ సమీక్షలో పేర్కొన్నారు. ఆ కోణంలోనే నివేదిక అందించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలకు కైవసం చేసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులతో పాటు ఎంపీల భాగస్వామ్యం కూడా ఉండాలని, అంత సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు.