స్వగ్రామంలో సీఎం రేవంత్ దసరా వేడుకలు

జనసంద్రంగా మారిన కొండారెడ్డిపల్లి,ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి

Update: 2025-10-02 16:00 GMT

దసరా ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఏడాదిలాగే తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఘనంగా జరుపుకున్నారు. స్వగ్రామానికి హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి చేరుకున్న , సీఎంకు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతోపాటు గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికి, ఆయనపై పూల వర్షం కురిపించారు. అనంతరం ఆ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి తన నివాసానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు.సాయంత్రం గ్రామంలోని దసరా ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కట్టమైసమ్మ దేవాలయంలో ఆయన పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి జమ్మిచెట్టు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో సీఎం పాల్గొంటున్నారని సమాచారంతో ఆ పరిసర గ్రామాల ప్రజలంతా కొండారెడ్డిపల్లెకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది. ఈనేపథ్యంలో కొండారెడ్డిపల్లెలో భారీగా పోలీసులు మోహరించారు.
Tags:    

Similar News