సిగాచి యాజమాన్యం ముఖం చాటేయడం మీద ముఖ్యమంత్రి అసంతృప్తి
సిగాచి బ్లాస్ట్ పై కొత్త నిపుణుల తో విచారణ: ముఖ్యమంత్రి ఆదేశాలు;
హైదరాబాద్ సిగాచి రసాయనాల పరిశ్రమలో జరిగిన బ్లాస్ట్ మీద తో వెంటనే నిపుణులతో విచారణ జరిపించి వెంటనే నివేదిక అందించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ఉదయం ఆయన బ్లాస్ట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కంపెనీ యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా యాజమాన్యం ప్రతినిధులెవరూ లేకపోవడం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినపుడు కంపెనీ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వ్యక్తి లేకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "24 గంటలవుతున్నది, మీ యాజమాన్య ప్రతినిధి ఎక్కడ, ఎండియో ఎవరో ఒకరు రావాల్నా, ఆయన ఎలా ముఖం చాటేస్తారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినపుడు కూడా ఆయన అంత బిజీ గా ఉంటే ఫ్యాక్టరీని నడపడం ఎందుకు? " ముఖ్యమంత్రి అడిగారు.
కంపెనీ యాజమాన్యానికి బాధ్యత లేదా,అలా వదిలేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు కంపెనీల మానవతా దృక్పథం ప్రదర్శించాలని అన్నారు.
ప్రమాద సూచనలను ఫ్యాక్టరీ దృష్టికి తెచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ఫ్యాక్టరీ, బాయిలర్స్ ఇన్ స్పెక్టర్స్ విజిట్ చేశారా. వాళ్లు ఏమయినా చెప్పారా. లోపాలు నోటీసు చేశారా, ఉంటే వాటి చర్యలు తీసుకున్నారా లేదా విచారణ చేయండని ఆదేశించారు.
ఫ్యాక్టరీలో యాక్సిడెంట్స్ జరిగాయా, హిస్టరీ చూడండని కూడా చెప్పారు. ఇపుడుయాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తనకు వెంటనే తెలియచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
" ఇపుడు జరిగిన ప్రమాదానికి స్పెసిఫిక్ రీజన్ తేల్చాలి. పరిశ్రమల్లో మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగలేదు. డిటైల్ రిపోర్టు కావాలి. నిపుణలు కమిటీ ఏర్పాటు చేయండి. జనరల్ ఒపినియన్స్ వద్దు. ఇంతకుముందు ఇన్ స్పెక్షన్ చేసిన వాళ్లు వద్దు. వాళ్లు పాత కారణాలే చెబుతారు. కొత్తనిపుణులతో కమిటీ వేయిండి. బయటి నుంచి ఆఫీసర్లను తెప్పించండి. డిటైల్డ్ రిపోర్టు వెంటనే నాకు కావాలి. పాశమైలారం లో ఇలాంటి పరిశ్రమలుఉన్నాయా.లోపాలను గుర్తించి చెప్పారా, పరిశ్రమల వాళ్లు చర్యలు తీసుకున్నారా, కంపెనీల యాక్సిడెంట్స్ హిస్టరీ స్టడీ చేయండి.లోపాలు ఉంటే వాటి గురించి ఆలోచించండి. మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు," అని ముఖ్యమంత్రి చెప్పారు.
డైరెక్టర్ ఫ్యాక్టరీస్ ను పిలిచి ఇన్ స్పెక్షన్ చేశావా అని ప్రశ్నించారు. ఏమయినా ఇస్యూస్ వుంటే యాజమాన్యానికి తెలిపారా అని అడిగారు.
ఫ్యాక్టరీలో ఎంత స్కిల్డ్ వర్కర్లున్నారు, ఎంత మంది అన్ స్కిల్డ్ వర్కర్లు ఉన్నారని యాజమన్యాన్ని ప్రశ్నించారు.
తన పర్యటన చేస్తున్నా యాజమాన్యం చెయిర్మన్ వంటి వక్తులు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ప్రతినిధులు నిన్న వచ్చి చూశారని కంపెనీ ప్రతినిధి ఒకరుచెప్పారు.
కంపెనీ తరఫున ఆర్థిక సహాయం , ఇన్స్యూరెన్స్ గురించి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి ఖర్చుకుూడా భరించాలని ఆయన ఆదేశించారు
కంపెనీ ఇలాంటపుడు కంపెనీలు మానవతా దృక్పథంతో ఉండాలని ఆయన కంపెనీ యాజమాన్యాన్నిఆదేశించారు.
యాజమాన్యం ప్రతినిధులయిన ఎండి, చెయిర్మన్ లు కార్మిక మంత్రిని కలవాలని కూడా ఆయన ఆదేశించారు.
సిగాచి పరిశ్రమలో పడిపోయేందుకు ఉన్న భవనాలున్నాయి? వాటిని ఎలా తొలగించాలో ఆలోచించండి? కంపెనీ తరఫున బాధ్యత ఎవరు స్వీకరిస్తారో నిర్ణయించండి అని డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేవంత్ పరామర్శించనున్నారు.