గిరిజన బాలిక కల నెరవేర్చిన సీఎం

డాక్టర్ కావాలని గిరిజన బాలిక కన్న కలలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నెరవేర్చారు. కుమురంభీం జిల్లాకు చెందిన బాలికకు సీఎం ఆర్థిక సాయం అందించారు.

Update: 2024-10-30 07:30 GMT

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో మెడిసిన్ సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాగానే ఆయన వెంటనే స్పందించారు. ఆ గిరిజన విద్యార్థిని కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

- సాయిశ్రద్ధ తల్లిదండ్రులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవగా, వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు సాయిశ్రద్ధ ఆనందం వ్యక్తం చేశారు.సాయి శ్రద్ధ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.సీఎం సాయం చేయడంతో డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది.

పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్‌ మోడం వంశీకి సీఎం అభినందన

పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పవర్ లిఫ్టర్ మోడం వంశీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున పాల్గొన్న వంశీ బంగారు పతకం సాధించారు. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో తాను సాధించిన బంగారు పతకాలను వంశీ సీఎంకు చూపించారు. ‘‘ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ, రోజుకూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో ఈరోజు ప్రపంచ విజేతగా మోడం వంశీ గారు ఇండియా కీర్తిని మరింత పెంచారు’’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.



 


Tags:    

Similar News