‘సభను తప్పుదోవ పట్టిచ్చొద్దు’.. హరీస్ రావును హెచ్చరించిన భట్టి

తెలంగాణ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మొదలవుతూనే తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు.;

Update: 2024-12-17 06:45 GMT

తెలంగాణ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మొదలవుతూనే తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్ఎస్ అప్పులు చేసిందని ప్రజలకు నూరిపోస్తున్న కాంగ్రెస్.. ఏడాదిలోనే రూ.1.27లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. హరీష్ రావు ఆరోపణలను తప్పుబట్టారు. అర్థం పర్థం లేని వాదనలతో సభా సమయాన్ని వృథా చేయొద్దని, సభను తప్పుదారి పట్టించొద్దంటూ హెచ్చరించారు. స్పీకర్ అనుమతిస్తే అప్పులు వ్యవహారంపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తాము అప్పులు చేయలేదని చెప్పడం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేయడం వల్లనే ఇప్పుడు అప్పులు చేసి రాష్ట్రంలో పాలన కొనసాగించాల్సి పరిస్థితులు వచ్చాయని భట్టి వివరించారు. గడ్డం ప్రసాద్‌కమార్ నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర అప్పులపై భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య భారీ వాదన జరిగింది.

ఐదేళ్లలో రూ.6.36 లక్షల కోట్ల అప్పు పక్కా: హరీష్ రావు

‘‘తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇలానే కొనసాగితే వాళ్ల ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి రాష్ట్ర అప్పు రూ.6.36 లక్షల కోట్లకు పెరగుతుంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ప్రస్తుతం ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రూ.4,17,496 కోట్ల అప్పులు చేస్తే.. అది రూ.7 లక్షల కోట్లు అప్పులు తెచ్చినట్లు ఈ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. అప్పులు అంశంపై సభలో ప్రత్యేక చర్చ చేపట్టాలి. ఎన్నికల ముందు వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం తమకు సమస్యే కాదని చెప్పిన భట్టి ఇప్పుడు అప్పుల పేరు చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నారు’’ అని హరీష్ రావు విమర్శించారు.

మేమీ దాచుకోవట్లేదు: భట్టి

రాష్ట్ర అప్పులపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం శ్వేపత్రం విడుదల చేసిందని తెలిపారు. ‘‘అబద్ధాలతో అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దు. సభను తప్పుదోవ పట్టించొద్దు. గత ప్రభుత్వ లోపాలను బహిర్గతం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ పాలనలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ఇళ్లు ఇచ్చారా? మేము తీసుకున్న అప్పులను దాచడం లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పుకంటూనే వచ్చింది’’ అని విమర్శించారు.

Tags:    

Similar News