కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సైబర్ దాడి.. న్యూడ్ కాల్ చేసి మరీ..
రాత్రి సమయంలో ఆయనకు న్యూడ్ కాల్ చేశారు. అది ట్రాప్ అని తెలుసుకునేలోపే స్క్రీన్ షాట్స్ తీసి ఆయన ఫోన్‌కు పంపారు నేరగాళ్లు.;
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైబర్ నేరాలు అతిపెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వీటిని నివారించడం పెద్ద ఛాలెంజ్‌గా మారింది. సైబర్ నేరగాళ్లు కూడా రోజురోజుకు పెట్రేగిపోతున్నారు. తమ నేరాలకు హద్దు లేకుండా పోతోంది. మహిళల ఫొటోలను డీపీలకు పెట్టుకుని, ఫోన్స్ కాల్స్‌లో ప్రేమను ఒలకబోస్తూ ట్రాప్‌లోకి దించి మోసాలు చేస్తున్నారు. ఇందులో ఇటీవల వచ్చిన కొత్త ట్రెండ్ న్యూడ్ కాల్స్. ఈ ట్రాప్‌ను తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై ప్రయోగించారు. రాత్రి సమయంలో ఆయనకు న్యూడ్ కాల్ చేశారు. అది ట్రాప్ అని తెలుసుకునేలోపే స్క్రీన్ షాట్స్ తీసి ఆయన ఫోన్‌కు పంపారు నేరగాళ్లు.
ఆ ఫొటోలతో ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకుంటే ఈ వీడియోను వైరల్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అందుకు ఎమ్మెల్యే నిరాకించారు ఈ క్రమంలోనే ఆయన సైబర్ పోలీసులు ఆశ్రయించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు అందించారు.