‘అంతా కేటీఆరే చేశాడు’

విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన చాలాప్రశ్నలకు అర్వింద్ సమాధానమిస్తు అంతా కేటీఆరే(KTR) చేసినట్లు చెప్పారు;

Update: 2025-07-04 10:54 GMT
KTR

అదేదో సినిమాలో ‘మొత్తంమీరే చేశారు’ అని హీరో తండ్రితో నిష్టూరంగా అంటాడు. అదేపద్దతిలో ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ‘మొత్తం కేటీఆరే చేశాడు..అన్నీ అనుమతులూ తాను చూసుకుంటానన్నాడు’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చెప్పినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car race) కేసులో ఏసీబీ విచారణ ముందు అర్వింద్ దాదాపు ఆరుగంటలున్నారు. విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన చాలాప్రశ్నలకు అర్వింద్ సమాధానమిస్తు అంతా కేటీఆరే(KTR) చేసినట్లు చెప్పారు. బ్రిటన్ లోని ఎఫ్ఈవో కంపెనీకి రు. 45.71 కోట్లను బదిలీచేయాలని మొబైల్ ఫోన్ వాట్సప్ ద్వారా కేటీఆరే మెసేజ్ చేశాడు. ఆర్ధికశాఖ అనుమతి లేకుండా నిధులబదిలీ సాధ్యంకాదని తాను చెప్పినట్లు అర్వింద్ చెప్పారు. అయితే తన మాటను కేటీఆర్ పట్టించుకేలేదని కూడా చెప్పారు.

ఆర్ధికశాఖ అనుమతుల విషయాన్ని తాను చూసుకుంటానని తనపైన నిధుల బదిలీకి వత్తిడి తెచ్చినట్లు ఆవేధనతో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేనిదే నిధులు పౌండ్లలో బదిలీచేసేందుకు లేదని చెప్పినా వినకుండా కేటీఆర్ నిధుల బదిలీ చేయించినట్లు అర్వింద్ విచారణలో చెప్పినట్లు సమాచారం. అనుమతిలేకుండా నిధులు బదిలీచేసినందుకే తర్వాత తెలంగాణ(Telangana) ప్రభుత్వం జరిమానా చెల్లించినట్లు అర్వింద్ అంగీకరించారు. తాజాగా అర్వింద్ కుమార్ విచారణలో చెప్పిన వివరాలను బట్టిచూస్తే ఫార్ములా కేసులో కేటీఆర్ తగులుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఆర్ధికశాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ లో చర్చించకుండా, ఆర్బీఐ అనుమతిలేకుండానే రు. 45 కోట్లు బ్రిబన్ కంపెనీకి బదిలీచేయటం మామూలు విషయంకాదు. ఏ స్ధాయిలో కేటీఆర్ అప్పట్లో అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారన్న విషయం అర్ధమవుతోంది. మరి కేటీఆర్ అధికారదుర్వినియోగం విషయంలో ఏసీబీ(Telangana ACB) అధికారులు కేటీఆర్, అర్వింద్, బీఎల్ఎన్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News