Dil Raju | ‘నన్ను క్షమించండి.. నేనె అలా అవమానించలేదు’
తెలంగాణను అవమాానించడంపై దిల్ రాజు స్పష్టతనిచ్చారు. తన మాటల వెనక ఉద్దేశం కూడా అదే స్పీచ్‌లో ఉందని చెప్పారు.;
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అందులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కించపరచేలా దిల్ రాజు మాట్లాడారంటూ పలవురు రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరైతే దిల్ రాజుపై కేసు నమోదు చేయాలని కూడా అన్నారు. ఈ వివాదం రోజురోజుకు అధికం అవుతున్న క్రమంలో తన వ్యాఖ్యలపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. శనివారం తన ఉద్దేశం అది కాదని, తెలంగాణ సంస్కృతిని అవమానించాలన్న ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
దిల్ రాజు ఏమన్నారంటే
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్రాడిన దిల్ రాజు.. సినిమాకు తెలంగాణలో కన్నా ఏపీలో ప్రజలు ఎక్కువ వైబ్ ఇస్తారన్నారు. ‘‘తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి ఇక్కడి జనాల నుంచి రాయాక్షన్ తక్కువ వస్తుంది. అదే డైరెక్టర్‌కి చెప్పాను. అదే ఆంధ్రకు వెళితే సినిమాకు ఓ మంచి వైబ్ ఇస్తారు. ఇక్కడ తెల్ల కల్లు, మటన్‌ను జనాలు ఆ రేంజ్‌లో ఇష్టపడతారు’’ అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. తమ సంస్కృతిని దిల్ రాజు అవమానించారని, ఇద ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా ఈ అంశంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు.
క్షమాపణలు
‘‘ఫిదా సినిమా తర్వాత నిజామాబాద్‌లో నిర్వహించిన సినిమా ఈవెంట్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్. ఫిదాకు కూడా సక్సెస్ మీట్ పెట్టాం అంతే. నిజామాబాద్‌పై నాకున్న ప్రేమ అటువంటిది. నేనూ నిజామాబాద్ వాసినే. ఈ ఈవెంట్‌లో నేను తెలంగాణ దావత్ గురించి మాట్లాను. కానీ నేను తెలంగాణ సంస్కృతిని అవమానించానని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేరశారు. అసలు తెలంగాణ దావత్ నా ఉద్దేశం ఏంటో అదే స్పీచ్ లాస్ట్‌లో చెప్పాను. మన కల్చర్, దావత్ మిస్ అవుతున్నా అని. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదల చేసిన తర్వాత తెలంగాణ స్టైల్ దావత్ చేసుకోవాలని ఉందని అన్నాను. నేను ఈ కల్చర్‌ను అభిమానిస్తాను. నిజంగా ఆ మాట వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించిండి. నా ఉద్దేశం అది కాదు. ఫిదా సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చేసింది. బలగం చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. తెలంగాణ వాసిని అయిన నేను ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను. మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్తున్నా’’ అని దిల్ రాజు స్పష్టం చేశారు.