Earth quake|తెలుగు రాష్ట్రాల్లో భూకంపం
తెలుగురాష్ట్రాల్లో తెల్లవారి భూప్రకంపనలు వచ్చాయి. బుధవారం సుమారు 7.30 గంటల ప్రాంతంలో చాలాచోట్ల కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది.
తెలుగురాష్ట్రాల్లో తెల్లవారి భూప్రకంపనలు వచ్చాయి. బుధవారం సుమారు 7.30 గంటల ప్రాంతంలో చాలాచోట్ల కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. భూకంపం దెబ్బకు జనాలు ఇళ్ళల్లోనుండి బయటకు పరుగులు తీశారు. ఏపీలోని విజయవాడ(Vijayawada), జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరుతో పాటు తెలంగాణా(Telangana)లోని ఉమ్మడి ఖమ్మం(Khammam), వరంగల్(Warangal), కరీంనగర్, రంగారెడ్డి(Rangareddy) జిల్లాతో పాటు హైదరాబాదు(Hyderabad)లోని కొన్ని ఏరియాల్లో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై(Rectorscale) 5.3గా నమోదైంది. హైదరాబాదులోని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు మాట్లాడుతు భూప్రకంపనలతో ఎలాంటి ఇబ్బందులు లేదని జనాలెవరు భయపడాల్సిన అవసరంలేదని ప్రకటించారు.
నగరంలోని వనస్ధలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణాలో ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతాలైన కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. హోలుమొత్తంమీద భూప్రకంపనలు దాదాపు 20 ఏళ్ళ తర్వాత వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే విధంగా భద్రాచలంలో 50 ఏళ్ళ తర్వాత భూకంపం రావటం ఇదే తొలిసారి. 1969లో భద్రాచలం ప్రాంతంలో నాలుగు సెకన్లు కంపించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో భూకంపం సమస్య(Earth quake) తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపం దెబ్బకు ఇళ్ళల్లోని వస్తువులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యయి. బీరువాలు, కప్ బోర్డులు, అలమర్లలోని సామన్లన్నీ పడిపోయాయి. మంచాలు కదిలిపోయాయి. మంచాలు కదిలిపోవటం, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవటంతో ఏమి జరుగుతోందో అర్ధంకాక జనాలు ఇళ్ళల్లో నుండి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల తర్వాత సర్దుకోవటంతో భయంభయంగానే జనాలు మళ్ళీ ఇళ్ళల్లోకి వెళ్ళారు.