వికారాబాద్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు

రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతగా నమోదైన భూ ప్రకంపనలు.;

Update: 2025-08-14 06:13 GMT

వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకవైపు కుండపోత వర్షాలు అల్లకల్లోలం చేస్తున్న సమయంలో భూమి కంపించడంతో ఎటు పరుగులు తీయాలో అర్థంకా ప్రజలు ఆందోళన చెందారు. అయితే పరిగి పరిగి పరిసర ప్రాంతాల్లో భూమిని సుమారు 3 సెకన్ల పాటు కంపించింది. రంగాపూర్, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్ర రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో బూకంపం వచ్చిన కాసేపటికే ఈదురు గాలులు వీయడం ప్రారంభించాయి. వీటి ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా ఉద్యోగస్తులు కూడా వీలైయితే ఇంటి నుంచే పని చేసుకోవాలని, అదే విధంగా తప్పని పరిస్థితుల్లో తప్పితే ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.

హైఅలెర్ట్‌లో ప్రభుత్వం..

రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం హైఅలెర్ట్ అయింది. అన్న శాఖల్లో సెలవులను రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పారిశుధ్యశాఖ, ఆరోగ్య శాఖ, విద్యుశాఖ, హైడ్రా ఇలా అన్ని వ్యవస్థలు సమన్వయంతో వర్షాల వల్ల తలెత్తుతున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నాయి. వానల వల్ల ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో దానిని క్లియర్ చేయడం కోసం ట్రాఫిక్ పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసర, తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని అధికారులు చెప్తున్నారు.

Tags:    

Similar News