తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

తెలంగాణలో మరో ఎన్నికల హడావిడి మొదలవనుంది. వచ్చే ఏడాది మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

Update: 2024-08-06 14:56 GMT

తెలంగాణలో మరో ఎన్నికల హడావిడి మొదలవనుంది. వచ్చే ఏడాది మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. 2025 మార్చి 29తో రెండు ఉపాధ్యాయుల, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

ఈ క్రమంలో ఓటర్ల జాబితా రూపొందించాల్సిందిగా స్టేట్ చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీస్ కి సర్క్యులర్ పంపింది. నవంబర్ ఒకటవ తేదీని క్వాలిఫయింగ్ డేట్ గా పెట్టుకోవాలని సూచించింది. ప్రస్తుతం శాసనమండలిలో మెదక్ నిజామాబాద్- ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న తాటిపర్తి జీవన్రెడ్డి (కాంగ్రెస్), టీచర్స్ ఎమ్మెల్సీలుగా ఉన్న కూర రఘోత్తమ్ రెడ్డి, (మెదక్ - నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్-ఖమ్మం-నల్లగొండ) పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29 తో కంప్లీట్ అవనుంది. అప్పటికి ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.

ఓటరు నమోదు ప్రక్రియ ఇలా...

పేర్ల నమోదుకు నోటిఫికేషన్ : సెప్టెంబర్ 30

ఓటరు నమోదుకు కటాఫ్ డేట్ : నవంబర్ 1

దరఖాస్తు చేసుకోడానికి తుది గడువు : నవంబర్ 6

ముసాయిదా ఓటర్ల జాబితా : నవంబర్ 23

అభ్యంతరాలు, ఫిర్యాదులకు చాన్స్ : నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు

పరిష్కరించేందుకు డెడ్లైన్ : డిసెంబర్ 25

తుది ఓటర్ల జాబితా విడుదల : డిసెంబర్ 30

Tags:    

Similar News