తెలుగు రాష్ట్రాల మధ్య తేలని పంచాయతి.. ముగిసిన సీఎస్‌ల భేటీ
రాష్ట్రపునఃవ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలో తొలిసారి భేటీ అయ్యారు.
రాష్ట్రపునఃవ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలో తొలిసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశం, విభజన పూర్తికాని సంస్థలకు చెందిన నగదు నిర్వలపైనా ముఖ్యంగా చర్చించారు. పంపకాం కాకుండా మిగిలిపోయిన రూ.8వేల కోట్లపై కూడా చర్చించారు. ఈ భేటీ ముగిసినప్పటికీ కొన్ని అంశాలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మూడు అంశాలపై ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. విద్యుత్ బకాయిల అంశం మాత్రం ఎటూ తేలకుండా మిగిలిపోయింది. రూ.861కోట్ల మేర లేబర్ సెస్‌ను ఆంధ్ర, తెలంగాణ మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై ఒక నిర్ణాయానికి రావాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలతో పాటు షెడ్యూల్ 9, 10 సంస్థ ఆస్తులు, అప్పులు పంపకాలు కూడా ఎటూ తేలలేదు.
ఉద్యోగుల మార్పుడిపై కూడా సీఎస్‌ల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన రూ.81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన రూ.81 కోట్లు తిరగి చెల్లించినట్లు ఆంధ్ర తెలిపింది. డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పోలీసులు, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో రెండు అంశాలపై కూడా సీఎస్‌ల కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సమావేశంలో అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై మరోసారి భేటీ కావాలని సీఎస్‌లు నిర్ణయించారు.
ఇదిలా ఉంటే 5 జూలై 2024న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు.. హైదరబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు. ఈ భేటీకి కొనసాగింపుగానే ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఈరోజు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాగా వాటిలో కొన్ని అపరిష్కృతంగా మిగిలాయి.