హైడ్రా చీఫ్ దృష్టికి వక్ఫ్ భూముల ఆక్రమణలు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి వక్ఫ్ స్థలాల ఆక్రమణల బాగోతం వచ్చింది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను తొలగించాలంటూ వక్ఫ్ బోర్డు సభ్యుడు వినతి పత్రం సమర్పించారు.
By : The Federal
Update: 2024-11-06 11:17 GMT
కోహ్ ఏ ఇమాం ఈ జమీన్ షియా వక్ఫ్ భూముల ఆక్రమణలను తొలగించండి అంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు వక్ఫ్ బోర్డు సభ్యుడు డాక్టర్ సయ్యద్ నిసార్ హుసేన్ తాజాగా వినతి పత్రం ఇచ్చారు. హైదర్ అఘా సాహెబ్ గా పేరొందిన నిసార్ హుసేన్ న్యాయవాదులు సయ్యద్ అలీ జాఫ్రీ, సయ్యద్ నజ్మూల్ హసన్ బాక్రిలతో కలిసి హైడ్రా కార్యాలయానికి వచ్చి ఏవీ రంగనాథ్ దృష్టికి షియా వక్ఫ్ భూముల ఆక్రమణల గురించి వివరించారు.
- తిరుమలగిరిలోని షియా వక్ఫ్ నకు చెందిన కోహ్ ఏ ఇమామ్ ఏ జమీన్ స్థలాన్ని ఆక్రమించి భవనాల నిర్మించారని వారు హైడ్రా చీఫ్ కు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ ఆక్రమణలను తొలగించడంతోపాటు భవిష్యత్ లో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సయ్యద్ నిసార్ హుసేన్ కోరారు.
- వక్ఫ్ భూములు, హెరిటేజ్ భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వక్ఫ్ బోర్డు సభ్యుడు డాక్టర్ సయ్యద్ నిసార్ హుసేన్ బృందానికి హామి ఇచ్చారు. ఆక్రమణలకు గురైన భూములను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చెప్పారు.