గల్ఫ్ మృతుల కుటుంబాలకు సీఎం శుభవార్త

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ మృతుల కుటుంబాలకు శుభవార్త వెల్లడించారు. గల్ఫ్ లో మరణించిన 160 మంది తెలంగాణ మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు.  

Update: 2024-10-23 13:37 GMT

పొట్ట చేతబట్టుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు గత ఏడాది డిసెంబరు 7 వతేదీ నుంచి ఇప్పటి వరకు 160 మంది మరణించారు.

- అనారోగ్యానికి గురై, ప్రమాదాల బారిన పడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నిధులు విడుదల చేశారు.

గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
ముఖమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఈనెల 21వతేదీన రూ.6 కోట్ల 45 లక్షలను 15 జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. నిధుల విడుదలకు సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాల వారీగా నిధుల విడుదల
గల్ఫ్ మృతుల సంఖ్య ఆధారంగా నిజామాబాద్ జిల్లాకు రూ.1 కోటి 75 లక్షలు, జగిత్యాలకు రూ.1 కోటి 40 లక్షలు, రాజన్న సిరిసిల్లకు రూ.60 లక్షలు, నిర్మల్ కు రూ.50 లక్షలు, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ఆదిలాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్ జిల్లాకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారని వారు తెలిపారు.గల్ఫ్ మృతుల సంఖ్యను బట్టి అన్ని జిల్లాలకు తగిన నిధులు విడుదల చేస్తారని ఇందుకోసం మొత్తంగా రూ.10 కోట్ల రూపాయలు కేటాయించారని వినోద్ కుమార్, భీంరెడ్డి తెలిపారు.


Tags:    

Similar News