‘కుల గణన.. తెలంగాణకు చేసిన హెల్త్ చెకప్’
అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకు కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలి.;
తెలంగాణలో చేసిన కులగణన కేవలం డేటా సేకరణ కార్యక్రమం కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది తెలంగాణకు చేసిన మెగా హెల్త్ చెకప్ అని, ఇందులో అనేక విషయాలు తెలిశాయని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ నివేదికను అందించారు.
ఈ సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను, సూచనలను కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది.
మొదటి దశలో 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా ఎంచుకుంది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్ను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ చేయించింది.
మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ఎంపీడీవో ఆఫీసులు, వెబ్సైట్ ద్వారా తమ వివరాలకు నమోదు చేయించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
ఈ సమగ్ర కుల గణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42%), ఎస్టీలు 37,08,408 మంది (10.43%), బీసీలు 2,00,37,668 మంది (56.36%), ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది (15.89%) మంది ఉన్నారు. ఈ సర్వే వివరాల నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్రెడ్డి గారి అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర్య నిపుణుల వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి అప్పగించింది.
వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ డేటాను సేకరించిన పద్దతి నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత మరియు వెనుకబడిన బలహీనవర్గాల వర్గాల అభ్యున్నతిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని సూచించింది.
కుల గణన విజయవంతం: రేవంత్
‘‘ఇది కేవలం డేటా కాదు… ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించాం. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది. అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, ఇందు