మంచిర్యాలలో నకిలీ కరెన్సీ కలకలం
వాటాలో తేడాలు రావడంతో జరిగిన ముష్టియుద్దం నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టును రట్టు చేసింది
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. గుడిపేటలో నకిలీ కరెన్సీ మార్పిడి చేసుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తులు ఘర్షణ పడటంతో విషయం బయటకు పొక్కింది. దుండగులు గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తున్న సమయంలో వాటాలో తేడాలు రావడంతో ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. వారిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఉప్పందించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిందితుల నుంచి నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీ చిల్డ్రన్ బ్యాంకు పేరిట ముద్రించారు. నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.
నకిలీ కరెన్సీ పోలీసులకు సవాల్ గా నిలిచింది. రెండువేల రూపాయలు రద్దయిన తర్వాత రూ500 నకిలీ కరెన్సీ ఎక్కువగా చలామణి అవుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఒక అసలు నోటుకు పది నకిలీ నోట్లు ఇస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ నోట్లను చూస్తే అసలు నకిలీ అనించలేదు అని పోలీసులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏది అసలు నోటు ఏది నకలీ అన్న కన్ ఫ్యూజన్ ప్రజల్లో నెలకొని ఉంది.