టాలీవుడ్‌లో లైంగికవేధింపులపై గళం విప్పిన ఫెమినిస్ట్ అలయెన్స్
టాలీవుడ్‌లో మహిళా నటీమణులపై సాగుతున్నలైంగిక వేధింపులపై ఆల్ఇండియా ఫెమినిస్ట్‌అలయెన్స్ గళం విప్పింది.ఈ మేరకు ఐఫా తెలంగాణ సీఎం రేవంత్,చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.
టాలీవుడ్‌లో మహిళా నటీమణులపై సాగిన లైంగిక వేధింపుల పర్వంపై 2022వ సంవత్సరంలో సబ్ కమిటీ విచారణ జరిపి నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది.ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని ప్రముఖ సినీనటి సమంత ఇటీవల డిమాండ్ చేసింది.సమంతతో పాటు పలువురు సినీనటీమణులు కూడా టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై విచారణ నివేదికను బయటపెట్టాలని కోరారు.
-టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై 2018వ సంవత్సరం అక్టోబరులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 2019 ఏప్రిల్ నెలలో కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను 2022 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
- కేరళ ప్రభుత్వం హేమ కమిటీ నివేదికను బహిర్గతం చేసినా తెలంగాణ సర్కారు మాత్రం ఆ నివేదికను రహస్యంగా ఉంచింది.
- టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఐఫా రెండు పేజీల లేఖలో కోరింది.స్ట్రీ వాద కూటమి ప్రతినిధులు అరుంధతీ ఘోష్, మీనా సరస్వతి, సిమిన్ అక్తర్, రోహిణి, ప్రకృతి, అలీఫా, సాగరి రాందాస్, శృతినాయక్ తదితర 53 మంది తెలంగాణ సీఎంకు లేఖ రాశారు.
హేమ కమిటీ రిపోర్టు వెలుగుచూడటంతో...