బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం, ముగ్గురికి గాయాలు

దీపావళి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేలుడుతో మంటలు వ్యాపించాయి.ఈ దుర్ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

Update: 2024-10-31 00:12 GMT

హైదరాబాద్ నగరంలోని ఆబిడ్స్ ప్రాంతం బొగ్గులకుంటలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పారాస్ బాణసంచా దుకాణంలో జరిగిన పేలుడుతో మంటలు ఎగసిపడ్డాయి.ఒక్కసారిగా టపాసులు పేలుతూ మంటలు వ్యాపించడంతో జనం పరుగులు తీశారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పది ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి.

- బాణాసంచా దుకాణంలో రాజుకున్న ఈ మంటలు పక్కన ఉన్న హోటల్ కు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మూడు అగ్నిమాపఖ వాహనాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
- పారస్ ఫైర్ వర్క్స్ పేరిట గుర్విందర్ సింగ్ బాణాసంచా దుకాణం ఏర్పాటు చేశారు. దీపావళికి జనం టపాసులు కొనుగోలు చేస్తుండగా టపాసులకు మంటలు అంటుకొని ఎగసి పడ్డాయి. దీంతో కొనుగోలుదారులు భయపడి పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది.
- బాణాసంచా దుకాణానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో బాణాసంచా దుకాణంతో పాటు పక్కన ఉన్న హోటల్ లో సామాగ్రి కాలి బూడిదైంది. అగ్నిమాపక శాఖ అధికారులు ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News