మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

వివిధ దశల్లో అభిప్రాయాల సేకరణ తర్వాత కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరిని కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిసింది;

Update: 2025-09-09 07:20 GMT
Maoist Central Committee's new Secretary

కరీంనగర్ కు చెందిన మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతిని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటి కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం. ఈమధ్యనే ఆపరేషన్ కగార్లో(Operation Kagar) భాగంగా జరిగిన ఎన్ కౌంటర్లో(Encounter) నంబాల కేశవరావు మరణించిన విషయం తెలిసిందే. నంబాల మరణం తర్వాత కొన్ని నెలలుగా మావోయిస్టు(Maoist Party) పార్టీకి పూర్తిస్ధాయి సెక్రటరీ లేడు. అలాంటిది వివిధ దశల్లో అభిప్రాయాల సేకరణ తర్వాత కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి(Tippiri Tirupati)ని కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిసింది.


ప్రస్తుతం తిప్పిరి మావోయిస్టు మిలిటరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. గతంలో పోలీసులపై జరిగిన అనేక గెరిల్లా దాడుల్లో తిప్పిరి చాలా చురుకుగా పాల్గొనటమే కాకుండా చాలాసార్లు నాయకత్వం కూడా వహించారు. గడచిన 30 ఏళ్ళుగా తిరుపతి మావోయిస్టు పార్టీ తరపున అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.

Tags:    

Similar News