తెలంగాణ లో ఎన్నికల సిబ్బంది భోజన మెనూ

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి బ్యాలెన్స్డ్ డైట్ అందించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-05-12 15:22 GMT

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి బ్యాలెన్స్డ్ డైట్ అందించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మే 13 న (రేపు) జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఒక రోజు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఎన్నికల సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందికి టామాటా పప్పు, కోడిగుడ్డు కూర భోజనంలో అందజేయనున్నారు.

తెలంగాణాలో ఈ నెల 12న ఆదివారం ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బందికి సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ.. 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం ఇచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం (అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందించారు.

పోలింగ్ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 గంటల మధ్య క్యారెట్, టమాటాతో కూడిన ఉప్మా పల్లీల చట్నీ, 11, 12 గంటల సమయంలో మజ్జిగ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో మజ్జిగ లేదా నిమ్మరసం అందించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు టీ, బిస్కెట్లు ఇస్తారు. ఈ ప్రక్రియ గ్రామాల్లో పంచాయతీ అధికారులు, పురపాలికల్లో ప్రత్యేకంగా నియామకమైన వారు పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు. 

Tags:    

Similar News