Food Safety inspections | ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు నీళ్లు, సీజ్

తెలంగాణలో హోటళ్లే కాదు వ్యాపారులు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు నీళ్లు వదిలారు.ఫుడ్ సేఫ్టీ టీం జరిపిన దాడుల్లో కొబ్బరిపొడిని రీ ప్యాకింగ్ చేసిన బాగోతం బయటపడింది.;

Update: 2024-12-07 14:03 GMT

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు,స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందంతో కలిసి హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఆహార భద్రత అధికారులు రూ. 60,050 కిలోల కొబ్బరి పొడిని స్వాధీనం చేసుకున్నారు.

- బేగంబజార్‌లోని ఆకాష్ ట్రేడింగ్ కంపెనీ నుంచి రూ.92.47 లక్షల విలువ గల కొబ్బరి పొడి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కు విరుద్ధంగా వివిధ బ్రాండ్‌లతో కొబ్బరి పొడిని రీప్యాకింగ్ చేస్తున్నారనే అనుమానంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.
- ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం 2006లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. వివిధ బ్రాండ్‌లతో కొబ్బరి పొడిని రీప్యాక్ చేశారని అధికారులు గుర్తించారు.దిగుమతి చేసుకున్న డెసికేటెడ్ కోకోనట్ పౌడర్‌లో వదులుగా ఉండే ఎండబెట్టని కొబ్బరి పొడిని కలిపారు.తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నా కల్తీ ఆహారం, అపరిశుభ్రత మధ్య కిచెన్లు మారటం లేదు.


Tags:    

Similar News