అపరిశుభ్ర హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా

హైదరాబాద్ లో మోమోస్ తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు.ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.

Update: 2024-10-29 14:18 GMT

సికింద్రాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు జరిపారు.సికింద్రాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌ అయిన నాంకింగ్ చైనీస్ రెస్టారెంట్‌లో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో వివిధ ఉల్లంఘనలు వెలుగుచూశాయి.

- నాంకింగ్ చైనీస్ రెస్టారెంట్‌లో రెస్టారెంట్‌లో రిఫ్రిజిరేటర్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం గుర్తించింది.ఈ రెస్టారెంట్ లో ఒపెన్ డ్రైనేజీ, ముసురుకున్న ఈగలు కనిపించాయి.

తనిఖీల్లో వెలుగుచూసిన పలు ఉల్లంఘనలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్నప్పటికీ,తనిఖీలు నిర్వహించే ప్రతిసారీ హోటళ్లలో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.రెస్టారెంట్‌లో రిఫ్రిజిరేటర్లు అపరిశుభ్రమైన స్థితిలో ఉన్నాయి. రిఫ్రిజిరేటరు తలుపులు, మూతలు విరిగిపోయి ఉన్నాయని బృందం గుర్తించింది.ఫ్రిజ్ లో ముడి ఆహార పదార్థాలు, వండిన ఆహార పదార్థాలను కూడా కలిసి నిల్వ ఉంచారు.వంటగది అంతా హౌస్‌ఫ్లస్‌తో డస్ట్‌బిన్‌లు బయటపడ్డాయని బృందం గమనించింది. వంటగది గుండా ఒక ఓపెన్ డ్రెయిన్ వెళుతోంది.

ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో క్యాంటీన్‌లో తనిఖీలు
సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.వంటగది అపరిశుభ్రంగా ఉందని తేలింది. తనిఖీలో ఆరు ఆహారోత్పత్తుల గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు.హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని రెస్టారెంట్లు,ఇతర తినుబండారాలలో ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేలా ఆహార భద్రతా బృందాలు దాడులు చేస్తున్నప్పటికీ, తనిఖీల సమయంలో ఉల్లంఘనలు బయటపడుతూనే ఉన్నాయి.కిచెన్ ఫ్లోర్, గోడలు, సీలింగ్ అపరిశుభ్రంగా ఉన్నాయి.హెయిర్‌నెట్‌లు, అప్రాన్‌లు, చేతి తొడుగులు లేకుండా కొన్ని ఫుడ్ హ్యాండ్లర్లు కనిపించారు.వెజ్, నాన్ వెజ్ వస్తువులు కలిపి నిల్వ చేశారు.

మోమోస్ తిని అస్వస్థత
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ నందినగర్ మోమోస్ తిని కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.నగరంలో మోమోస్ తిన్న తర్వాత అస్వస్థతకు గురైన 13 మంది స్వాతి, తన్వీర్ ఆసుపత్రుల్లో చేరారు. ఫుడ్ పాయిజనింగ్ కు కారణాలను విశ్లేషించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వైద్యులను సంప్రదించారు. ఖైరతాబాద్ చింతల బస్తీలో వావ్ హాట్ మోమోస్, ఢిల్లీ హాట్ మోమోస్ లో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మోమోస్ తయారీ కేంద్రాలకు జీహెచ్ఎంసీ, ఎఫ్ఎస్ఎస్ఏఐల అనుమతి లేదని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో మోమోస్ శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు.

మోమోస్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
మోమోస్ తిన్నవారు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు 110 మోమోస్ తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. మోమోస్ తయారీ కేంద్రాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడైంది. దీంతో 69 శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు.



Tags:    

Similar News