జూబ్లిహిల్స్ కాంగ్రెస్ రేసులో నలుగురు

నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు అధిష్టానానికి

Update: 2025-10-06 07:44 GMT

జూబ్లిహిల్స్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ చేసిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది.టిక్కెట్ కోసం పోటీ పడుతున్న వారి నుంచి  నలుగురి పేర్లను ఎంపిక చేసిన టీపీసీసీ ఆ పేర్లను అధిష్టానానికి పంపనుంది.కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి వుండటంతో జూబ్లీహిల్స్ టిక్కెట్ కూడా బీసీలకే కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో పీసీసీ ఎంపిక చేసిన నలుగురు లోనూ ముగ్గురు బీసీలే వున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పీసీసీ నేతల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకొని చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ , సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతురామ్మోహన్, కార్పోరేటర్ సిఎన్ రెడ్డి పేర్లును ప్రతిపాదించారు. ఈ నలుగురి పేర్లలో ఒకరిని అధిష్టానం  రెండు రోజులలో ఖరారు చేస్తుందని చెబుతున్నారు. అయితే 2014ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తరుపున పోటీ చేసి ,  మాగంటి గోపీనాధ్ కు గట్టి పోటీ ఇచ్చి ,ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ కు ఈసారి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 




నవీన్ యాదవ్

నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న యువ నేత. ముస్లిం మైనార్టీల్లో మంచి పేరు ఉంది. జూబ్లిహిల్స్ లో యాదవకులస్థులు గెలుపోటములను ప్రభావితం చేస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. 2014లో ఈ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపినాథ్ గెలిచారు. కేవలం 9242 వోట్ల చేడాతో ఓడిన నవీన్ యాదవ్ ఎంత పవర్ ఫుల్ నేత అనేది అందరికీ అర్థమైంది. ఈ కారణంగానే నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేట్టడం లోనూ నవీన్ ముందున్నారు. గతంలో కంటెస్టడ్ అభ్యర్థి కావడంతో వోటర్లతో ఆయనకు పరిచయాలున్నాయి. నవీన్ యాదవ్ సేవలను ఎఐసీసీ గుర్తించే అవకాశముంది.




 అంజన్ కుమార్ యాదవ్

సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా జూబ్లీ హిల్స్ రేసులో   వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. తండ్రి కొడుకులకు కీలక పదవులు ఇప్పటికే వుండటంతో  టికెట్ లభించకపోవచ్చన్న వాదన  కూడా ఉంది.




 


బొంతు రామ్మోహన్

బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో హైదరాబాద్ మేయర్ గా పని చేసిన బొంతు రామ్మోహన్ పేరును పిసిసి సిఫారసు చేయాలని నిర్ణయించుకుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ ను అభ్యర్థిగా ప్రకటిస్తే బిఆర్ఎస్ వోట్ బ్యాంక్ కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశముందని పార్టీ వర్గాలుభావిస్తున్నాయి.


 



సిఎన్ రెడ్డి

బిఆర్ఎస్ కార్పోరేటర్ గా ఉన్న సీఎన్ రెడ్డి ఇటీవలె కాంగ్రెస్ లో చేరారు . ఆయనకి జూబ్లిహిల్స్ పై మంచి పట్టు ఉంది. అగ్రవర్ణాల వోట్లు ఆయనకు పడే అవకాశముందని పిసిసి ఆలోచిస్తోంది.రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు సీఎన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం,. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా పేరుండటంతో సీఎం సిఫారసు తోనే ఈయన పేరును కూడా పీసీపీ అధిష్టానానికి పంపే జాబితాలో చేర్చిందంటున్నారు.

త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుండటంతో అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ పై దృష్టి పెట్టాయి. బీఆర్ఎస్ మాగంటి గోపీనాధ్ సతీమణి సునీతనే ఇప్పటికే తమ అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ కూడా అభ్యర్ధి కసరత్తు చేస్తోంది. ఈ పరిణామాల నేపద్యంలో జూబ్లీహిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్ధి ఎంపికలో ఆచితూచీ వ్యవహరిస్తోంది.ఇప్పటికే పార్టీ పరంగా పలు సర్వేలు కూడా చేయించింది. ఆశావహ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసింది.

Tags:    

Similar News