రూ.99లకే హైదరాబాద్ నుంచి విజయవాడకి

హైదరాబాద్ నుంచి 289 కిలో మీటర్ల దూరంలోని విజయవాడకు కేవలం 99 రూపాయలకే తీసుకువెళతారా! అంటే అవుననే చెబుతున్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.;

Update: 2025-02-07 04:16 GMT
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో సిటీబస్ ఎక్కి పటాన్ చెరు బస్టాప్ లో దిగితే సిటీబస్ చార్జీ 45 మొదలు 75 రూపాయల వరకు ఉంటుంది. అటువంటిది హైదరాబాద్ నుంచి 289 కిలో మీటర్ల దూరంలోని విజయవాడకు కేవలం 99 రూపాయలకే తీసుకువెళతారా! అంటే అవుననే చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈటీవో మోటార్స్ తయారు చేసిన ఫ్లిక్స్ బస్ ఇండియాను మంత్రి పొన్నం ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను(ఈవీ) ప్రోత్సహిస్తోందన్నారు. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్తు బస్సులను ఫిబ్రవరి 7న బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈటీవో మోటార్స్‌ సీఎంవో వైఎస్‌ఆర్‌ రాజీవ్, ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడారు. మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఈవీ బస్సులు నడుస్తాయని వారు చెప్పారు. ఆ తర్వాత విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభిస్తామన్నారు. సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అయిదు గంటల్లో బస్సులు గమ్యానికి చేరుతాయిి. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పథకాలన్నీ ఈ బస్సుల్లోనూ వర్తిస్తాయి. 49 మంది ప్రయాణించే సదుపాయం ఉంది. రానున్న రోజుల్లో స్లీపర్‌ కోచ్‌లతో బస్సులను అందుబాటులోకి తెస్తారు.
FlixBus సర్వీసులు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 3న బెంగళూరు నుండి దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలకు కేవలం రూ. 99 ప్రత్యేక ప్రమోషనల్ ఛార్జీ కింద బస్సులను నడిపింది. అక్టోబర్ 6 వరకు నడిపాయి.
ఫ్లిక్స్‌బస్ అనేది జర్మన్‌కు చెందిన రవాణా సంస్థ. ఇది 2024 సెప్టెంబర్ లో బెంగళూరులో తన సేవలను ప్రారంభించింది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బెలగావి, కోయంబత్తూర్, మధురై, విజయవాడ నగరాలకు బెంగళూరు నుంచి బసులు నడిపింది.
ఫ్లిక్స్‌బస్ దక్షిణ భారతదేశంలోని 33 నగరాలను, దేశవ్యాప్తంగా 101 నగరాలను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
FlixBus టిక్కెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
Tags:    

Similar News